AP CM Chandrababu Naidu Deeksha: మీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు... మోదీపై చంద్రబాబు ఫైర్

AP CM Chandrababu Naidu Deeksha in Delhi: మేం కన్నెర్ర చేస్తే మీరు ఏమవుతారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్నే నిందిస్తారని విమర్శించారు. ఏపీ గడ్డపై అడుగు పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ మోదీని నిలదీశారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 10:28 AM IST
AP CM Chandrababu Naidu Deeksha: మీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు... మోదీపై చంద్రబాబు ఫైర్
ఢిల్లీలో చంద్రబాబు పోరాట దీక్ష
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 10:28 AM IST
 

ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్షకు దిగిన చంద్రబాబు... ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తమ సత్తా ఏంటో చూపించడానికే ఢిల్లీకి వచ్చామన్నారు. లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న సీఎం... మేం కట్టే పన్నుల లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. మోదీ వ్యక్తిగత విమర్శల దిగారని ఆరోపించారు. మేం పోరాడేది హక్కుల కోసమే కానీ... మీ భిక్ష కోసం కాదన్నారు. హస్తిన వేదికగా ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. మోదీకి పాలించే అర్హత లేదన్నారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. న్యాయం చేయమంటే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు.

మీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు చంద్రబాబు. మేం కూడా కూడా దేశంలో భాగమే అన్నారు. మీ ఆటలు సాగవని చెప్పడానికే ఢిల్లీకి వచ్చామన్నారు. మోదీకి పాలించే అర్హత లేదన్నారు చంద్రబాబు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమన్నారు.. న్యాయం చేయమంటే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు విభజన గాయం మానలేదన్నారు. మూడురోజుల సమయం ఉంది... ఇప్పటివరకు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి... పార్లమెంట్‌లో ప్రకటన చేయండని సూచించారు. లేదంటే ఏపీ ప్రజలు శాశ్వతంగా బీజేపీని బహిష్కరించే పరిస్థితి వస్తుందన్నారు.

ప్రత్యేక హోదా సాధించే వరకు, విభజన హామీలు సాధించేవరకు మా పోరాటం ఆగదన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఢిల్లీకి వచ్చామన్నారు. రాకుండా ఎన్నో ఇబ్బందులు సృష్టించారన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. మేం కన్నెర్ర చేస్తే మీరు ఏమవుతారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. మా రాష్ట్రానికి వచ్చి మమ్మల్నే నిందిస్తారని విమర్శించారు. ఏపీ గడ్డపై అడుగు పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ మోదీని నిలదీశారు.



ప్రతీ ఒకరు కసితో ఉన్నారన్నారు సీఎం. అలాంటివారిందరి తరపున పోరాడేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు చంద్రబాబు. జాతీయ నాయకుల మద్దతు కూడా కూడగడుతామన్నారు. గుంటూరు సభలో మోదీ తనను విమర్శించేందుకు పరిమితమయ్యారన్నారు చంద్రబాబు పరిపాలించే వ్యక్తులు బాధ్యతతో ఉండాలన్నారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు