రాముడు అందరివాడు..బీజేపీది డివైడ్ అండ్ రూల్ పాలసీ: ఫరూక్ అబ్దుల్లా

Live AP CM Chandrababu Naidu Deeksha in Delhi: బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజల్ని కులాలు, మతాలు వర్గాలుగా విభజించి పాలిస్తుందన్నారు. బ్రిటీష్ విధానమైన డివైండ్ అండ్ రూల్ పాలసీని పాటిస్తుందన్నారు ఫరూక్ అబ్దుల్లా.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 1:36 PM IST
రాముడు అందరివాడు..బీజేపీది డివైడ్ అండ్ రూల్ పాలసీ: ఫరూక్ అబ్దుల్లా
చంద్రబాబు దీక్షకు ఫరూక్ అబ్దుల్లా సంఘీభావం (ఏఎన్ఐ ట్విట్టర్)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 1:36 PM IST
రాముడు కేవలం హిందువులకే కాదు విశ్వంలో అందరివాడు అన్నారు  జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా. ధర్మాలు చెబితే సరిపోదు పాటించాలని బీజేపీ నేతలకు చురకలంటించారు. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారాయన.

భారతదేశంలో ప్రజలందరికీ ఇక్కడ బతికే హక్కు ఉందన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వర్గాలుగా విభజించి పాలిస్తుందన్నారు. బ్రిటీష్ విధానమైన డివైండ్ అండ్ రూల్ పాలసీని పాటిస్తుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందర్నీ ఏకం చేసే బాధ్యత తీసుకున్నారన్నారు. దీనికోసం నేను ఆయన్ని అభినందిస్తున్నానన్నారు. భారత్‌ను కాపాడాలంటే బీజేపీ సర్కార్‌ను గద్దె దింపాలన్నారు.

ఐక్యతగా ఉన్నంతవరకు ఎవరూ ఏం చేయలేరన్నారు ఫరూక్ అబ్దుల్లా. కర్నాటకలో డబ్బులు విసిరి ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు కోట్ల డబ్బులు విసిరి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. అధికారం కోసం బీజేపీ ఎక్కడికైనా వెళ్తుందన్నారు. అధికారం కోసం ఎలాంటి పనులు అయినా చేయిస్తుందని విమర్శించారు. తమ హక్కులు గెలిచేవరకు ఏపీ ప్రజలు పోరాటం ఆపవద్దని పిలుపునిచ్చారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...