మోదీ పాకిస్తాన్ ప్రధానిలా మారిపోయారు: అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ తరపున పోటీ చేసి దేశ ప్రధానిలా కాకుండా కేవలం బీజేపీ ప్రధానిలా మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో మోదీ వ్యవహరిస్తున్న తీరు భారత్ ప్రధానిలా కాకుండా.. పాకిస్తాన్ పీఎంలా ఉందంటూ ఆరోపించారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 4:35 PM IST
మోదీ పాకిస్తాన్ ప్రధానిలా మారిపోయారు: అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( ట్విట్టర్ ఫోటో )
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 4:35 PM IST
హస్తిన వేదికగా చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు చేశారు కేజ్రీవాల్. ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేసిన సీఎంగా గెలిచిన వ్యక్తి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అవుతాడు కానీ.. పార్టీకి కాదన్నారు. అయితే ప్రధాని మోదీ కూడా బీజేపీ తరపున పోటీ చేసి దేశ ప్రధానిలా కాకుండా కేవలం బీజేపీ ప్రధానిలా మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో మోదీ వ్యవహరిస్తున్న తీరు భారత్ ప్రధానిలా కాకుండా.. పాకిస్తాన్ పీఎంలా ఉందంటూ ఆరోపించారు.

అంతకుముందు పలువురు జాతీయ నేతలు కూడా చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్ల, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. తెలుగు ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధర్మపోరాట దీక్ష వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు నాయకులు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధానిపై లేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీకి రానున్నారు. అక్కడ చంద్రబాబుతో ఆమె సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం మమత .... చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...