AP CM CHANDRABABU NAIDU DECIDED TO HOLD REVIEW MEETING WITH OFFICIALS IF ELECTION COMMISSION SAYS NO TO CABINET MEETING AK
కేబినెట్ భేటీకి ఈసీ నో అంటే... అలా ముందుకెళ్లనున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ అంశాల అజెండాను ఈసీకి పంపించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఈసీకి తాము పంపించిన అజెండాపై చంద్రబాబుతో భేటీ అయ్యామని చెప్పిన ఎల్వీ సుబ్రహ్మణ్యం... కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేబినెట్ భేటీకి అనుమతి రాని పక్షంలో ఏం చేయాలనే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి నిరాకరించిన పక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరవు, ఫణి తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించాలనే యోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అయితే కేబినెట్ భేటీపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై స్పష్టత వచ్చిన తరువాతే అధికారులతో సమీక్ష అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.