Home /News /politics /

AP CM CHANDRABABU NAIDU CHAPTER CLOSE IN TELANGANA VIJAYSAI REDDY

తెలంగాణలో చంద్రబాబు చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి

చంద్రబాబు, విజయసాయిరెడ్డి

చంద్రబాబు, విజయసాయిరెడ్డి

    చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై కామెంట్స్ చేశారాయన. చంద్రబాబుతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరాజయం పాలైనా కాంగ్రెస్‌కు సానుభూతి మిగిలి ఉండేదని ఎద్దేవా చేశారు. ఎక్కడా దిక్కు లేక చంద్రబాబు డబ్బు మూటలతో వస్తే పెత్తనం అంతా ఆయనకు అప్పగించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని విమర్శించారు. స్వయంకృతాపరాధం అంటే ఇదే అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.

    చంద్రబాబు ‘పార్థీనియం’ అంటే కలుపుమొక్క లాంటివాడని విమర్శించారు. ఈ కబళించే కలుపు మొక్క పంటల్ని నాశనం చేస్తుందన్నారు. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారన్నారు. తెలంగాణా ప్రజానీకం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు పార్థీనియం లైఫ్ రాజకీయంగా ముగిసినట్లే అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ అన్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా రావడంతో... విజయసాయిరెడ్డి ప్రజా కూటమికి ఓటమి తప్పలేదని వ్యాఖ్యలు చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Chandrababu naidu, Telangana Election 2018, Vijayasai reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు