నిఖిల్‌ను గెలిపించండి..సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం

వెగౌడ ఫ్యామిలీపై ప్రశంసలు గుప్పించిన చంద్రబాబు..నిఖిల్‌ను మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే సుమలతపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా..బీజేపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: April 15, 2019, 8:22 PM IST
నిఖిల్‌ను గెలిపించండి..సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం
చంద్రబాబు, సుమలత, నిఖిల్
  • Share this:
ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే దేశంలో మోదీ పాలన పోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. మోదీ పాలనలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మాండ్యాలో జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థి, కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కు మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి సుమలత బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ ఫ్యామిలీపై ప్రశంసలు గుప్పించిన చంద్రబాబు..నిఖిల్‌ను మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే సుమలతపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా..బీజేపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.

ప్రజాస్వామ్యం బతకాలంటే మోదీ ఇంటికి పోవాలి. నోట్లరద్దు పిచ్చి తుగ్లక్ చర్య. 2వేల నోటతో అవినీతి పెరిగిపోయింది. మోదీ, అమిత్ షాలు అవినీతిపరులు. కుమారస్వామి వంటి నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
చంద్రబాబునాయుడు


నరేంద్ర మోదీ చెప్పినట్లే ఎన్నికల సంఘం నడుచుకుంటోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని..వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. 50శాతం స్లిప్పులను లెక్కించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు ఏపీ సీఎం. వీవీప్యాట్ స్లిప్పులు 7 సెకన్లు పాటు కనిపించానలి..కానీ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో 3 సెకన్లే కనిపించాయని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజలు గమనించాలని సూచించారు.

మాండ్యాలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీచేస్తున్నారు. మొన్నటి వరకు సుమలత కాంగ్రెస్‌లో ఉన్నారు. టికెట్ రాకపోవడం వల్లే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. బీజేపీ దొడ్డిదారిన మద్దతు ఇస్తోంది. అక్కడ పోటీచేసే సత్తాలేకే ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్ సహా కాంగ్రెస్-జేడీఎస్ అభ్యర్థులందరినీ గెలిపించండి.
చంద్రబాబునాయుడు


మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఎన్డీయే హయాంలోనే ఎక్కువ మంది జవాన్లు చనిపోయారని చంద్రబాబు ఆరోపించారు. మహిళల భద్రత విషయంలో భారత్‌కు దిగువ స్థానంలో ఉందన్న ఏపీ సీఎం..మోదీ హయంలో గోరక్షకుల దాడులు, మూకదాడులు పెరిగాయని మండిపడ్డారు. దేశాన్ని మోదీ భ్రష్టుపట్టించారని..మోదీ కంటే దేశాన్ని బాగా పరిపాలించగలిగిన నేతలు చాలా మంది ఉన్నారని స్పష్టంచేశారు చంద్రబాబు.First published: April 15, 2019, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading