Home /News /politics /

AP CM CHANDRABABU NAIDU CALL FOR PROTEST ON PM MODI VISHAKA TOUR ALLEGES CONSPIRACY BEHIND VISHAKA RAILWAY ZONE AK

అది మాయా జోన్... మోదీ వెళ్లేంతవరకు నిరసన... చంద్రబాబు వ్యాఖ్యలు

నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)

నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)

మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయమని... ఆదాయం లేని జోన్ బీజేపీ కుట్ర అని చంద్రబాబు ధ్వజమెత్తురు

    విశాఖ రైల్వే జోన్ అంటూ రాబడి లేని మాయా జోన్‌ను రాష్ట్రానికి ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... ప్రత్యేక జోన్ అడిగితే ఉన్న డివిజన్ కూడా తీసేశారని కేంద్రం తీరును తప్పుబట్టారు. మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయమని... ఆదాయం లేని జోన్ బీజేపీ కుట్ర అని చంద్రబాబు ధ్వజమెత్తారు. దీన్ని రాష్ట్రంలోని అందరూ ఖండించాలని... మోదీ నమ్మకద్రోహాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.

    విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వెళ్లేంతవరకు నిరసనలు తెలియజేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. మన గాయాలపై కారం జల్లడానికే మోదీ రాష్ట్రానికి వస్తున్నాయని దుయ్యబట్టారు. నల్ల బెలూన్లు, నల్ల జెండాలతో అంతా నిరసన తెలియజేయాలని కోరిన చంద్రబాబు... తాను కూడా నల్లచొక్కా వేసుకుని నిరసన తెలియజేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు టీడీపీతో పాటు రాష్ట్రానికి ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన చంద్రబాబు... అన్ని ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లలో పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయని అన్నారు. 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తయ్యిందని... మరో 13 నియోజకవర్గాల్లో సమీక్ష నిర్వహించాల్సి ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు.




    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Narendra modi, Pm modi, Tdp, Visakha Railway Zone, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు