ఒకే ప్రాంతంలో చంద్రబాబు, జగన్ వేసవి విడిది... ఎక్కడో తెలుసా...

ఎన్నికల సమయంలో హోరాహోరీగా తలపడిన టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం... ఫ్యామిలీతో కలిసి కొద్ది రోజుల విహార యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఒకే చోటికి విహార యాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 27, 2019, 7:37 AM IST
ఒకే ప్రాంతంలో చంద్రబాబు, జగన్ వేసవి విడిది... ఎక్కడో తెలుసా...
చంద్రబాబు, జగన్
  • Share this:
ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో హోరాహోరీగా తలపడిన టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం... ఫ్యామిలీతో కలిసి కొద్ది రోజుల విహార యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఒకే చోటికి విహార యాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కుటుంబసభ్యులతో కలిసి కులూ మనాలీలో మూడు రోజుల పాటు పర్యటించబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

సోమవారం ఆయన విజయవాడ తిరిగి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఐదు రోజుల పాటు కులూ మనాలీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత ఆయన విహార యాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన కూడా చండీగఢ్ వెళ్లి... అక్కడి నుంచి కులూ మనాలీ వెళ్లినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. దేశీయ వేసవి విడిది కేంద్రంలోనే ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఐదు రోజుల గడిపినట్టు సన్నిహితులు పేర్కొన్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలోని అధికార, విపక్ష నేతలు ఒకే చోట వేసవి విడిదికి వెళ్లినట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: April 27, 2019, 7:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading