చంద్రబాబు రాక ముందే వెళ్లిపోయిన కేసీఆర్... ఎక్కడో తెలుసా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబునాయుడు, కేసీఆర్ మధ్య రాజకీయ వైరం తీవ్రరూపం దాల్చుతూ వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబను ఎక్కువగా టార్గెట్ చేయగా... ఏపీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కేసీఆర్‌పై ఎక్కువగా విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: April 20, 2019, 2:47 PM IST
చంద్రబాబు రాక ముందే వెళ్లిపోయిన కేసీఆర్... ఎక్కడో తెలుసా ?
చంద్రబాబు, కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)
news18-telugu
Updated: April 20, 2019, 2:47 PM IST
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య పొలిటికల్ వార్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఈ ఇరువురి నేతల మధ్య రాజకీయ వైరం తీవ్రరూపం దాల్చుతూ వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబను ఎక్కువగా టార్గెట్ చేయగా... ఏపీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కేసీఆర్‌పై ఎక్కువగా విమర్శలు గుప్పించారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయంగా పూడ్చలేనంత అగాధం ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో చంద్రబాబును ఓడించి జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కేసీఆర్‌పై పైచేయి సాధించేందుకు టీడీపీ అధినేత కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా రామోజీరావు మనవరాలు వివాహ వేడుకకు హాజరైన ఇరువురు... ఒకరికొకరు ఎదురుపడకుండా ముందుగానే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి హాజరైన ఇరువురు చంద్రబాబునాయుడు, కేసీఆర్... ఒకరికొకరు ఎదురుపడకుండా ఈ వేడుకకు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. ముందుగా ఈ వివాహ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... చంద్రబాబునాయుడు రాక ముందే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక కేసీఆర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న తరువాతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి వచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే చాలారోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... ఈ పెళ్లి వేడుకలో ఒకరినొకరు పలకరించుకోవడం విశేషం.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...