హోమ్ /వార్తలు /రాజకీయం /

మోదీ.. ఎన్టీఆర్ మహానాయకుడు చూడు.. నేనేంటో తెలుస్తుంది: చంద్రబాబు

మోదీ.. ఎన్టీఆర్ మహానాయకుడు చూడు.. నేనేంటో తెలుస్తుంది: చంద్రబాబు

చంద్రబాబు, నరేంద్రమోదీ

చంద్రబాబు, నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన... మోదీ బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.

  కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా కొడుమూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తనకు ఎదురు తిరిగినవారిని భయపెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, అయితే అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు చంద్రబాబు. తన గురించి తెలియాలంటే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూడాలని మోదీకి సూచించారు.


  ‘‘ నాపై గతంలో 24 బాంబులు వేశారు. ఆ సమయంలోనే నేను భయడపడలేదు. ఇప్పుడు మోదీ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడబోను. భయమనేది నాకు తెలియదు. నరేంద్ర మోదీ.. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూడు. చంద్రబాబునాయుడంటే ఏమిటో తెలుస్తుంది. 1982లోనే కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఎదురు తిరిగి తెలుగువారి సత్తా చాటి చెప్పాం’’ అని చంద్రబాబు అన్నారు.


  ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు కొనసాగింపుగా బాలకృష్ణ ప్రధానపాత్రలో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్‌రావు మోసం చేసి సీఎం కుర్చీని లాక్కున్న ఎపిసోడే ప్రధానాంశంగా ఉంటుంది. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రాణా నటించారు. అయితే, తాజాగా ఒక పబ్లిక్ మీటింగ్‌లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూడాలంటూ మోదీకి సూచించారు. అప్పుడే చంద్రబాబునాయుడంటే ఏమిటో తెలుస్తుందన్నారు.

  First published:

  Tags: Narendra modi, NTR Mahanayakudu, Pm modi

  ఉత్తమ కథలు