మళ్లీ టీడీపీదే అధికారం... 130 స్థానాల్లో గెలుపు... పార్టీ నేతలతో చంద్రబాబు

Chandrababu Naidu comments on AP elections 2019 | అర్థరాత్రి పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... తనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి 130 సీట్లు వస్తాయని వెల్లడించారు.

news18-telugu
Updated: April 12, 2019, 8:41 AM IST
మళ్లీ టీడీపీదే అధికారం... 130 స్థానాల్లో గెలుపు... పార్టీ నేతలతో చంద్రబాబు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 12, 2019, 8:41 AM IST
ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు. అర్థరాత్రి పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... తనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి 130 సీట్లు వస్తాయని వెల్లడించారు. ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అన్నారు. అర్థరాత్రి వరకు విధులు నిర్వహించిన పార్టీ బూత్ ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని చంద్రబాబు అన్నారు. ఫలితాలు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఇక ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ పలు చోట్ల విధ్వంసాలకు తెరలేపిందని చంద్రబాబు ఆరోపించారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ వైపు నిలిచారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని...అరాచకాలు సృష్టించాలని భావించిన వారికి ప్రజలు ఓటుతోనే బుద్ధిచెప్పారని అన్నారు. మహిళలు ఈ సమయంలో కూడా క్యూలో అవస్థలు పడే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా... ప్రజలు టీడీపీ వైపు నిలిచారని... అంతా గట్టిగా నిలబడి కుట్రలను ఎదుర్కొన్నామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.


First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...