చంద్రబాబుకు షాక్... ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ

లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: February 8, 2020, 11:02 AM IST
చంద్రబాబుకు షాక్... ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్... ఏపీ సీఐడీ లేఖ
  • Share this:
ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాశారు. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 2 లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు ఏపీ సీఐడీ విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లేఖతో పాటు ఎక్సెల్ షీట్లో 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు, లాండ్ అడ్రస్, సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సిఐడి అధికారులు పంపించారు. ఏపీ సిఐడి విజ్ఞప్తితో అసైండ్ భూములలో కొనుగోలులో 2018-2019 మధ్య జరిగిన ట్రాన్షక్షన్లపై ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ తన విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిపై కేసులను నమోదు చేసిన సీఐడీ అధికారులు... తాజాగా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందిన వీరంతా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలపై సీఐడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన అసైన్డ్ భూములకు సంబంధించిన లావా దేవీల వ్యవహారాలన్ని తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన బడాబాబుల వివరాలన్నీ తెరపైకి వస్తాయని పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయా నేతల ఇప్పుడు భూముల వ్యవహారం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు