రంగనాయకమ్మను విచారించిన సీఐడీ... గతంలో పెట్టిన పోస్టులపైనా ప్రశ్నలు

రంగనాయకమ్మ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా చెప్పారని, ఇలాంటి పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు, సమాధానం చెప్పలేదని సీఐడీ పేర్కొంది.

news18-telugu
Updated: May 21, 2020, 8:09 PM IST
రంగనాయకమ్మను విచారించిన సీఐడీ... గతంలో పెట్టిన పోస్టులపైనా ప్రశ్నలు
రంగనాయకమ్మకు ఏపీ సీఐడీ నోటీసులు (File)
  • Share this:
ఏపీ ప్రభుత్వంపై ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసినందుకు సీఐడీ నుంచి నోటీసులు అందుకున్న రంగనాయకమ్మ కేసుపై సీఐడీ ప్రకటన చేసింది. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఆమె పోస్టులు పెట్టారని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటివి సృష్టిస్తూ... వ్యక్తిగత అభిప్రాయమని ఎలా చెబుతారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారని, రంగనాయకమ్మ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా చెప్పారని, ఇలాంటి పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు, సమాధానం చెప్పలేదని సీఐడీ పేర్కొంది.‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా చాలా పోస్టులు పెట్టారు. అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర పథకాలను ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50శాతం జీతాలు తగ్గించారని మరో పోస్టు పెట్టారు. మూడు రాజధానుల్లో ఒకటి కరోనా... రెండోది విషవాయివు, మూడవది రైతుల ధర్నాఅని మరో పోస్టు పెట్టారు’ అని సీఐడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను అధికారులు విచారించారు. రంగనాయకమ్మ సీఐడీ ఆఫీసుకు వెళ్లక ముందు ఆమెను సీపీఐ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఎల్జీ ప్రమాదంపై ఎం జరిగిందో దానినే తాను ఫేస్ బుక్‌లో పెట్టానని వివరించారు. అలా పోస్టులు పెట్టడం తప్పని కూడా తనకు తెలియదన్నారు.
First published: May 21, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading