తిరుమలలో ఏపీ సీఈఓ... ఎన్నికలు విజయవంతమన్న ద్వివేది

శ్రీవారి సేవలో గోపాల కృష్ణ ద్వివేది

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయ్యిందని తెలిపారు. దేశంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయని తెలిపారు ద్వివేది.

  • Share this:
    తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ద్వివేదికి తిరుమల అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయ్యిందని తెలిపారు. దేశంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయని తెలిపారు. ఈవీఎం మొరాయింపులు రెండు శాతానికి మించలేదన్నారు.

    ఆదివారం ఏపీ ఎన్నికల అధికారులంతా గవర్నర్ నరసింహాన్‌ను కలిశారు. ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ గోపాల్ కృష్ణ ద్వివేదితో పాటు... పలువురు అధికారులు నరసింహన్‌ను కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాల్ని గవర్నర్‌కు అందించారు.
    First published: