నెల్లూరు వీవీప్యాట్ స్లిప్పులపై సీఈవో వివరణ..ఉద్యోగుల అరెస్ట్‌కు ఆదేశం

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.

news18-telugu
Updated: April 15, 2019, 9:12 PM IST
నెల్లూరు వీవీప్యాట్ స్లిప్పులపై సీఈవో వివరణ..ఉద్యోగుల అరెస్ట్‌కు ఆదేశం
గోపాల క్రిష్ణ ద్వివేది
  • Share this:
నెల్లూరులో ఓ స్కూల్ ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం ఏపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఐతే ఆ స్లిప్పులపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. అక్కడ దొరికి చీటీలు పోలింగ్ రోజువేసినవి కాదని...మాక్ పోలింగ్ తాలూకు స్లిప్పులని స్పష్టంచేశారు. సిబ్బంది ఉద్దేశపూర్తంగా బయట పారేసినట్లుగా ద్వివేది ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.


నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వెలుగు చూసిన వీవీప్యాట్‌ స్లిప్పులు పోలింగ్‌ రోజువి కాదు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవిఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమే.

పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజక వర్గానికి కేటాయించిన ఈవిఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్‌ చేశారు. ఈవిఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత వాటిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా కమీషనింగ్‌ సమయంలో వేసిన వీవీప్యాట్‌ స్లిప్పులను బయట పారేశారు. వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు పెట్టి తక్షణం అరెస్ట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం.
గోపాలక్రిష్ణ ద్వివేది, ఏపీ సీఈవో
అంతకుముందు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తీవ్ర కలకలం రేగింది. స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన వీవీపాట్ స్లిప్పులు ఆరుబయట కనిపించడం సంచలనం రేపింది. ప్రభుత్వ పాఠశాల బయట కుప్పలుకుప్పులగా స్లిప్పులు కనిపించండంతో ఓ విద్యార్థి మీడియాకు సమాచారం అందించారు. ఐతే ఆ స్లిప్పులు ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.ర్యాండమైజేషన్ స్లిప్పులయినప్పటికీ వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో స్లిప్పులు పట్టుబడ్డాయి. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆర్డీవో స్కూల్ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. పలు కవర్లలో వారికి వీవీపాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిపై సీరియల్ నెంబర్, సెషన్, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారుల వివరణ కోరారు.

ఇవి కూడా చదవండి:

Video: స్కూల్ ఆవరణలో వీవీపాట్ స్లిప్పులు..కలెక్టర్ ఆరాఏపీలో వీవీప్యాట్ స్లిప్పుల కలకలం..స్కూలు బయట కట్టలు కట్టలు
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు