రాజధాని తరలింపు అప్పుడే... హైకోర్టుకు తెలిపిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు పాస్ అయిన తర్వాతే రాజధాని తరలుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: April 24, 2020, 7:46 PM IST
రాజధాని తరలింపు అప్పుడే... హైకోర్టుకు తెలిపిన జగన్ సర్కార్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపుపై ఏపీ హైకోర్టుకు వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు పాస్ అయిన తర్వాతే రాజధాని తరలుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ హైకోర్టుకు నోటిమాటగా చెప్పినట్టు తెలిసింది. అయితే, దీనిపై అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనికి పది రోజుల గడువు ఇచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టంలో మార్పులు తెస్తూ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన రెండు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందాయి. అయితే, శాసనమండలిలో బ్రేక్ పడింది. రెండు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. రాజధాని విశాఖకు తరలడం ఖాయమని స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను జనవరి 22న శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపింది. అయితే, టెక్నికల్ కారణాలతో కమిటీ ఏర్పాటు కాలేదు. ఏదైనా బిల్లు శాసనమండలిలో మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే దాన్ని అది ఆమోదం పొందినట్టుగానే భావిస్తారు. మరోసారి అదే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం ద్వారా రాజధాని తరలింపు అధికారికంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 24, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading