జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన రాజధాని రైతులు

పవన్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేందుకు రాజధాని రైతులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 24, 2019, 12:31 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన రాజధాని రైతులు
పవన్ కళ్యాణ్ (file)
news18-telugu
Updated: August 24, 2019, 12:31 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు అమరావతి రైతులు. పవన్‌తో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున రైతులు పార్టీకార్యాలయానికి చేరుకున్నారు. రాజధానితో పాటు తమ సమస్యలపై పోరాటానికి మద్దతివ్వాలని పవన్‌ను అన్నదాతలు కోరనున్నట్లు సమాచారం . దీంతో పవన్ వారితో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. దాదాపు గంటపాటు వీరితో పవన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేందుకు రాజధాని రైతులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్‌లోనే ఉన్నారన్న సమాచారంతో ఆయనను కూడా కలిసి తమ గోడు వినిపించాలని అన్నదాతలు భావిస్తున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి ఇంకా సరైన సమాచారం లేదు.

ఇప్పటికే రాజధాని రైతులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని ఆదుకోవాలంటూ కోరారు. రాజధానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మూడునెలలుగా రైతులు దారుణ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రైతులకు కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అయోమయోంలో ఉందన్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...