సీఎం జగన్‌కు షాక్.. రాజధాని బిల్లు గట్టెక్కదా..?

ఏపీ రాజధాని మార్పు బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. అయితే.. ఇప్పుడు టీడీపీ బలం ఉన్న శాసనమండలిలో నెగ్గాలి. కానీ.. అమరావతికి జై కొడుతున్న టీడీపీ.. ఆ బిల్లుకు అడ్డు పడే అవకాశం ఉంది.

news18-telugu
Updated: January 21, 2020, 9:01 AM IST
సీఎం జగన్‌కు షాక్.. రాజధాని బిల్లు గట్టెక్కదా..?
సీఎం జగన్
  • Share this:
ఏపీ రాజధాని మార్పు బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. అయితే.. ఇప్పుడు టీడీపీ బలం ఉన్న శాసనమండలిలో నెగ్గాలి. కానీ.. అమరావతికి జై కొడుతున్న టీడీపీ.. ఆ బిల్లుకు అడ్డు పడే అవకాశం ఉంది. బిల్లు నేడు మండలికి చేరబోతోంది. అక్కడ బిల్లును ఆమోదం పొందనీయకుండా టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించే అవకాశం ఉంది. బిల్లు మండలికి చేరిన అనంతరం.. ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఎమ్మెల్సీలకు చంద్రబాబు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఆమోదం పొందకుండా బిల్లును తిరస్కరించి వెనక్కి పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే శాసనసభలో రెండో సారి ఆమోదించి మళ్లీ మండలికి పంపుతారు.

అయితే.. బిల్లును ఆమోదించుకోవడానికి జగన్ సర్కారు వ్యూహరచన చేస్తోంది. ఒకవేళ.. వ్యూహం ఫలించకపోతే ఆర్డినెన్స్ జారీ చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆరు నెలల్లోగా దాన్ని ఆమోదించుకోవాల్సి ఉంటుంది. దానికి.. గవర్నర్ ఆమోదం తెలపాలి. ఆయన దాన్ని కేంద్రం పరిశీలనకు పంపింతే అక్కడ కూడా ఆలస్యం కానుంది. అదీకాక.. ఆర్డినెన్స్‌ జారీపై కోర్టులో పిటిషన్లు వేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో రాజధాని మార్పు ప్రక్రియ పెండింగ్‌లో పడే అవకాశం ఉంది.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు