అమరావతి ఉద్యమంలో మరో కీలక ఘట్టం..

అమరావతి రాజధాని ఉద్యమం మరో మైలురాయిని చేరుకుంది. లాక్‌డౌన్ ఉన్నా, కరోనా వ్యాపిస్తున్నా ఆగని ఉద్యమం నేటితో 150వ రోజుకు చేరుకుంది.

news18-telugu
Updated: May 15, 2020, 10:13 AM IST
అమరావతి ఉద్యమంలో మరో కీలక ఘట్టం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతి రాజధాని ఉద్యమం మరో మైలురాయిని చేరుకుంది. లాక్‌డౌన్ ఉన్నా, కరోనా వ్యాపిస్తున్నా ఆగని ఉద్యమం నేటితో 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ లేఖ రాశారు. లేఖలో.. ‘అమరావతి రాజధాని ఉద్యమం నేటికి 150 వ రోజుకు చేరింది.లాఠీలు ఝళిపించినా, అక్రమంగా కేసులు బనాయించినా, అరెస్టులు చేసి జైళ్లకు పంపినా ఉద్యమం నేటి వరకు శాంతియుతంగానే సాగింది.మూడు రాజధానులంటూ అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలించే ప్రయత్నం చేశారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ విష వాయువు లీకేజీ ఘటనతో మీకు మద్దతిచ్చేవారు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పటికైనా మూడు రాజధానుల మాట విరమించుకొని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయండి. మీరు తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుతున్నాయి. మీ మొండి వైఖరి వీడనాడి పరిపాలనపై దృష్టి సారించండి’ అని పేర్కొన్నారు.
First published: May 15, 2020, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading