news18-telugu
Updated: November 26, 2019, 8:29 PM IST
బొత్స సత్యనారాయణ, కొడాలి నాని
ఏపీ మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ మీద రాజధానిలో కొందరు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మీద బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏసీ రూముల్లో కూర్చున్న బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానంతో పోలుస్తారా? అని మండిపడ్డారు. ‘కొడాలి నాని ఆఫీసులో కాదు. ప్రజల్లోకి మాట్లాడాలి. అప్పుడు శవాన్ని పంపిస్తాం. నిన్నటి వరకు టీడీపీలో ఉండి.. ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేస్తావా?. జగన్ ఎన్ని వేల కోట్లు ఇచ్చారు. కొడాలి నాని ఇకపై అవాకులు చెవాకులు పేలితే నిన్ను చంపి జైలుకు వెళతాం.’ అని నిప్పులు చెరిగారు.మరోవైపు బొత్స సత్యనారాయణ మీద కూడా మహిళలు మండిపడ్డారు. నిన్నటి వరకు అమరావతి లోతట్టు ప్రాంతం. రాజధానిగా పనికిరాదంటూ ఆరు నెలల పాటు నిర్మాణాలు ఆపేశారని మండిపడ్డారు. ఆ శ్మశానంలోనే ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు ఏ ఒక్క రోజు కూడా రాజధాని గ్రామంలో రైతులతో మాట్లాడలేదని మహిళలు అన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 26, 2019, 7:51 PM IST