చంద్రబాబుకు షాక్... ఈ మూడు స్కీంలపై సీబీఐ విచారణ జగన్ నిర్ణయం

చంద్రబాబునాయుడు హయాంలో తీసుకొచ్చిన మూడు పథకాల మీద సీబీఐ విచారణ జరపాలని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది.

news18-telugu
Updated: June 11, 2020, 3:24 PM IST
చంద్రబాబుకు షాక్... ఈ మూడు స్కీంలపై సీబీఐ విచారణ జగన్ నిర్ణయం
చంద్రబాబు హయాంలో అవినీతిపై సీఎం జగన్‌కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక
  • Share this:
చంద్రబాబునాయుడు హయాంలో తీసుకొచ్చిన మూడు పథకాల మీద సీబీఐ విచారణ జరపాలని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పథకాల్లో అవినీతి జరిగిందంటూ సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. ఫైబర్ గ్రిడ్, రంజాన్ తోఫా, చంద్రన్నకానుక, క్రిస్మస్ కానుక పథకాల్లో అవినీతి జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈరోజు కేబినెట్‌కు అందజేసింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని క్యాబినెట్ కు మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొంది. అర్హత లేని సంస్థలకు కట్టబెట్టారని స్పష్టం చేసింది. సెటప్ బాక్సుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని నిర్ధారించింది. ఫైబర్ నెట్‍లో సుమారు.700 కోట్ల మేర అవినీతి జరిగిందని నివేదికలో ఉపసంఘం స్పష్టం చేసింది. టెరా సాఫ్ట్ వేర్కేం కేంద్రంగా అవినీతి జరిగిందని కమిటీ నిర్ధారించింది. చంద్రన్న రంజాన్ తోఫా,  చంద్రన్న కానుక, క్రిస్మస్ కానుక వంటి స్కీంల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని ఉపసంఘం తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు అని తెలిపింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఈ మూడింటి మీద చర్చించిన ఏపీ కేబినెట్ దీనిపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 11, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading