ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక నిర్ణయాలు

రైతు భరోసా పథకంపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో లబ్ది దారుల ఎంపిక , నిధుల కేటాయింపు వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే కంటి వెలుగు పథకం రెండో దశ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ సహచరులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 7:23 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక నిర్ణయాలు
వైఎస్ జగన్
news18-telugu
Updated: October 16, 2019, 7:23 AM IST
(సయ్యద్ అహ్మద్, విజయవాడ న్యూస్ 18 ప్రతినిధి)
ఏపీ కేబినెట్ బుధవారం భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా తాజాగా మారిన రాజధాని ప్లాన్ ఆమోదం, నవంబర్ 1 నుంచి పోలవరం పనులు తిరిగి ప్రారంభించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పీపీఏల విషయంలో కేంద్రం వైఖరి నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రణాళికలు, ఆర్టీసీ విలీనం, ఆరోగ్య రంగ సంస్కరణలపై సుజాతారావు కమిటీ నివేదికకు ఆమోదం, కంటివెలుగు, రైతు భరోసా పథకాలపైనా చర్చించే అవకాశముంది.

దాదాపు నెల రోజుల విరామం తర్వాత బుధవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి ప్లాన్ లో మార్పులపై చర్చించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని గతంలో సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్లాన్ లో మార్పులు మార్చాలని సీఆర్డీయే నిర్ణయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అలాగే పోలవరంలో రివర్స్ టెండరింగ్ ను విజయవంతంగా పూర్తి చేసిన సర్కారు.. నవంబర్ 1 నుంచి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలపై కేబినెట్ చర్చించే అవకాశముంది.

అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న అ‌భ్యంతరాల నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ సందర్భంగా కూడా పీపీఏలపై చర్చించారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వం.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల విలీనాన్ని సైతం త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా అధికారులతో తాజాగా కమిటీని వేసిన ప్రభుత్వం.. తదుపరి ప్రక్రియపై దృష్టిసారించనుంది. అలాగే ఆరోగ్య సంస్కరణపై సుజాతారావు కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించనుంది.అటు రైతు భరోసా పథకంపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో లబ్ది దారుల ఎంపిక , నిధుల కేటాయింపు వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే కంటి వెలుగు పథకం రెండో దశ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ సహచరులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వాహన మిత్ర పథకం అమలుతో పాటు నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించే పథకంపైనా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. స్ధానిక సంస్ధలు, సహకార ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలు, మున్సిపాలిటీల విలీనం వంటి అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...