Home /News /politics /

AP CABINET MEETING ON MONDAY THERE THE KEY DECISIONS WHICH MAY TAKE PLACE BA

నేడు ఏపీ కేబినెట్... రైతులు, పోలీసులకు గుడ్ న్యూస్ అందించనున్న చంద్రబాబు

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

రైతు రుణమాఫీ విడుదలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సాయం పెంపునకు కూడా నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సోమవారం సమావేశం కాబోతోంది. 10.30 గంటలకు ఏపీ కేయాబినెట్ భేటీ కానుంది. రైతు రుణమాఫీ విడుదలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సాయం పెంపునకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీపై ఈ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూకేటాయింపులకూ, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 20 సంవత్సరాల సర్వీస్ దాటిన వారికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించనున్నారు. కానిస్టేబుల్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్‌గా సుమారు 1,259 మంది పదోన్నతి ఇవ్వనున్నారు. అర్చకులకూ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అర్చకులకు పూర్తి హక్కుల కల్పనపై లా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ మేనిఫెస్టో కమిటీ కూడా భేటీ కానుంది. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు. ఈ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై పార్టీ జిల్లా నేతలతోనూ చర్చించనున్నారు మేనిఫెస్టో కమిటీ సభ్యులు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Tdp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు