కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త జిల్లాలపైనే ప్రధాన చర్చ

ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం

news18-telugu
Updated: July 15, 2020, 3:31 PM IST
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త జిల్లాలపైనే ప్రధాన చర్చ
ఏపీ కేబినెట్ సమావేశం
  • Share this:
అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 22 అంశాలపై ఏపీ మంత్రివర్గం చర్చిస్తోంది. ఇందులో ప్రధానమైనది కొత్త జిల్లా ఏర్పాటు అంశం. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై కేబినెట్ చర్చించినట్లు సమాచారం. అటు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై సమాలోచనలు చేశారు. వీటితో పాటు ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం.


కేబినెట్‌లో చర్చించిన అంశాలు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ చేస్తూ కేబినేట్ లో నిర్ణయం

పగటిపూట 9గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గంలో చర్చ

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడంపై కేబినేట్ లో చర్చ

గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు పై కేబినేట్ లో చర్చమరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కేబినేట్ లో చర్చ.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్‌లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ కేబినేట్ లో ఆమోదం.

420 టీచర్ పోస్టులను, 178 నాన్ టీచింగ్ పోస్ట్ లను శ్రీకాకుళం, ఒంగోలులో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో పోస్టులు క్రియేట్ చేస్తూ కేబినేట్ అమోదం.

31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినేట్‌లో నిర్ణయం.

సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్‌ల పోస్టింగ్ లను ఏర్పాటు చేస్తూ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం.

డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిస్తూ కేబినేట్ అమోదం.

ఐదు కోట్లతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేబినేట్‌లో చర్చ.

తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం

ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు ఆమోదం.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading