సోమవారం ఏపీ కేబినెట్ భేటీ... మండలి రద్దు కోసమేనా?

అందరూ అనుకుంటున్నదే జరుగుతోందా? సోమవారం ఏపీ కేబినెట్ రద్దు నిర్ణయం కేబినెట్ తీసుకోబోతోందా? నెక్ట్స్ ఏంటి? ఏం జరగబోతోంది?

news18-telugu
Updated: January 25, 2020, 5:44 AM IST
సోమవారం ఏపీ కేబినెట్ భేటీ... మండలి రద్దు కోసమేనా?
Video : దిశ యాప్ తొలి సక్సెస్.. ఆనందంతో చప్పట్లు కొట్టిన జగన్
  • Share this:
ఈ నెల 27న అంటే సోమవారం మార్నింగ్ 9.30కి ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఏం చర్చిస్తారో మనకు తెలుసు. అదే రోజు అసెంబ్లీ అదనపు సమావేశం ఉంటుంది కాబట్టి... కచ్చితంగా చర్చించబోయేది శాసన మండలి రద్దే. ఆల్రెడీ ఇదే విషయంపై గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. ఈ మండలి అవసరమా? దీని వల్ల ఏం ఉపయోగం? ఏడాదికి రూ.60 కోట్లు వేస్ట్ అంటూ సీఎం జగన్... ఆవేశంగా మాట్లాడారు. మండలి రద్దుపై సోమవారం చర్చిద్దామని ప్రతిపాదించారు. అందువల్ల సోమవారం ఉదయం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించేది మండలి రద్దు గురించే. రద్దు దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతేముంది... అసెంబ్లీ మొదలవుతుంది. రద్దు తీర్మానం ప్రవేశపెట్టి... చర్చిస్తారు. అన్ని పార్టీలూ తమ తమ అభిప్రాయం చెప్పాక... రద్దు నిర్ణయంపై ఓటింగ్ జరిగితే... ఆటోమేటిక్‌గా ప్రభుత్వానిదే మెజార్టీ కాబట్టి... రద్దు నిర్ణయానికి అసెంబ్లీలో ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత అదే తీర్మాన బిల్లును కేంద్రానికి పంపిస్తారు. అందువల్ల సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కేబినెట్ భేటీ కీలకం కాబోతోంది. భేటీ తర్వాత BAC సమావేశమై... అసెంబ్లీ సమావేశాలు ఇంకెన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుటుంది. తర్వాత కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లుల్ని ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లుల్ని అసెంబ్లీ ఆమోదించింది. బట్ మండలిలో ఆ బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులపై ఓటింగ్‌లో టీడీపీ సభ్యులు సునీత, సిద్ధార్థరెడ్డి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లు వేశారు. తర్వాత రెండు బిల్లుల్నీ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. ఇదే సీఎం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఛైర్మన్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటున్న ప్రభుత్వం... మండలిని రద్దు చేయడమే కరెక్ట్ అని డిసైడైంది. ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారన్నది ప్రభుత్వ వాదన. రద్దుకు సంబంధించి సీఎం జగన్... సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో చర్చించారు. అందువల్ల సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే... రాష్ట్ర చరిత్రలో సోమవారం మరో ప్రత్యేక దినం కానుంది.
Published by: Krishna Kumar N
First published: January 25, 2020, 5:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading