నవయుగ కంపెనీకి షాక్... పోలవరం కాంట్రక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం

నవయుగ కంపెనీ పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

news18-telugu
Updated: September 4, 2019, 12:20 PM IST
నవయుగ కంపెనీకి షాక్... పోలవరం కాంట్రక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం
జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  నవయుగ కంపెనీ పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది.

దీంతో పాటు ఉపీలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడిగించింది. ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. 2018 ఆగస్టు నుంచి రూ. 1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3వేలకు పెంచింది ప్రభుత్వం. మరో రూ.3వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించింది అప్పటి ప్రభుత్వం. ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. సీఎం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఓకే చెప్పింది. మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం మంత్రివర్గం తెలిపింది.
First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading