కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. డేట్ ఫిక్స్.. వారికే ఛాన్స్

AP Cabinet Expansion: ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారే కావడంతో... కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ఎంపిక చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 3, 2020, 7:11 AM IST
కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. డేట్ ఫిక్స్.. వారికే ఛాన్స్
సీఎం జగన్
  • Share this:
మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో... ఏపీ కేబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు స్థానాలను సీఎం జగన్ ఎప్పుడు భర్తీ చేస్తారు ? ఎవరితో భర్తీ చేస్తారు ? అనే దానిపై వైసీపీ వర్గాలతో పాటు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే కేబినెట్‌లో ఖాళీ కాబోయే స్థానాలను సాధ్యమైనంత తొందరగా భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. శ్రావణమాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Ap cabinet expansion news, ap cabinet expansion on july 22, mopidevi venkataramana, pilli subhash chandrabose, cm ys jagan decided over ap cabinet expansion, ఏపీ మంత్రివర్గ విస్తరణ, జులై 22న ఏపీ కేబినెట్ విస్తరణ, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం
సీఎం జగన్‌తో రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా ఇతర ఎంపీలు (ఫైల్ ఫోటో)


ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారే కావడంతో... కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ఎంపిక చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల కోటాలో బీసీ వర్గానికి చెందిన వారినే ఎంపిక చేయాలని నిర్ణయించిన సీఎం జగన్... రాజీనామా చేసిన మంత్రుల జిల్లాలకు చెందిన వారినే కేబినెట్‌లోకి తీసుకుంటారా ? లేక ఇతర జిల్లాలకు చెందిన వారికి ఛాన్స్ ఇస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
First published: July 3, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading