మన పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసులు పెడతారా ? ఏపీ కేబినెట్‌లో వాడీవేడీ చర్చ

AP Data Breach Case | డేటా చోరీ, తెలంగాణ ప్రభుత్వం తీరుపై చర్చించిన ఏపీ మంత్రివర్గం... ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర పోలీసులపై ఇంకో రాష్ట్ర పోలీసులు కేసులు పెడతామని అనడం ఏంటి ? అని మంత్రులు ఆక్షేపించారు.

news18-telugu
Updated: March 5, 2019, 4:53 PM IST
మన పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసులు పెడతారా ? ఏపీ కేబినెట్‌లో వాడీవేడీ చర్చ
ఏపీ కేబినెట్ సమావేశం
  • Share this:
డేటా చోరీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో వాడీవేడీ చర్చ జరిగింది. డేటా చోరీ, తెలంగాణ ప్రభుత్వం తీరుపై చర్చించిన ఏపీ మంత్రివర్గం... ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీసులపై ఇంకో రాష్ట్ర పోలీసులు కేసులు పెడతామని అనడం ఏంటి ? అని మంత్రులు ఆక్షేపించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపైనా మంత్రివర్గంలో ప్రస్తావన వచ్చింది. ఓట్ల తొలగింపులో అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశంపై కేబినెట్ చర్చించింది. డేటా చోరీ కేసు వ్యవహారంలో దేశమంతా చర్చ జరగాలన్న చంద్రబాబు... మంత్రులు, సీనియర్లతో చర్చించి కార్యాచరణ తయారు చేద్దామని సూచించారు.

ఏపీ పొరుగురాష్ట్రాలైన తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో ఇబ్బందులు లేవన్న మంత్రులు... కేవలం తెలంగాణతో మాత్రమే సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. సైబరాబాద్ సీపీ వ్యాఖ్యలు, వ్యవహారశైలి సరికాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిణగిస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. పరిధికి మించి ప్రవర్తిస్తే చట్టప్రకరాం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ ఉంటుందని అన్నారు. చట్టప్రకారం మనకున్న హక్కులు ఉపయోగించుకుంటామని... తెలంగాణ ప్రభుత్వం చర్యలను తిప్పకొడతామని మంత్రి శ్రీనివాసులు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ బకాయిలు, పోలవరంపై కేసులను తీవ్రంగా పరిగణించాల్న చంద్రబాబు... ఆస్తుల పంపిణీకి సహకరించకపోగా తమపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు.


First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...