ఏపీలో వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఏ కులం వారికి ఎంత నగదు అంటే..

వైఎస్ఆర్ పెళ్లికానుక పేరుతో కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. పెళ్లిరోజే పెళ్లికానుకను అందిస్తారు.

news18-telugu
Updated: September 4, 2019, 10:23 PM IST
ఏపీలో వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఏ కులం వారికి ఎంత నగదు అంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీ ప్రభుత్వం మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వైఎస్ఆర్ పెళ్లికానుక, వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకంతో పాటు ఆటోవాలాలు, ట్యాక్సీడ్రైవర్ల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. సొంతంగా ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నవారికి ఏటా రూ.10వేల సాయం అందిస్తారు. భార్య - భర్త ఒక యూనిట్‌గా లెక్కిస్తారు. మేజర్ అయిన కూతురు లేదా కొడుక్కి కూడా సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ.10వేలు ఇస్తారు. ఈ పథకానికి ఏటా రూ.400 కోట్ల ఖర్చు అవుతుంది. 4లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారులు ఈనెల 10 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల నేతృత్వంలో రవాణా కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకం కింద, జాతీయస్థాయిలో పతకాలు తెచ్చిన వారికి నగదు బహుమతులు ఇవ్వనున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ.5లక్షలు, సిల్వర్ బహుమతి సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3లక్షలు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ పథకం కోసం రూ.5కోట్లు కేటాయించారు.

వైఎస్ఆర్ పెళ్లికానుక..

వైఎస్ఆర్ పెళ్లికానుక పేరుతో కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. పెళ్లిరోజే పెళ్లికానుకను అందిస్తారు. ఈ పథకానికి రూ.750 కోట్లు కేటాయిస్తారు. ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.25 లక్షలు, బీసీలకు రూ.50వేలు, బీసీలు కులాంతర వివాహం రూ.75వేలు, మైనారిటీలకు రూ.లక్ష, వికలాంగులకు రూ.1.50లక్షలు, భవన నిర్మాణ కార్మికలు పిల్లలకు రూ.లక్ష పెళ్లికానుకగా అందిస్తారు.
First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading