శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం...

ఏపీ అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చించాలనుకున్న ప్రభుత్వం... కేబినెట్‌లో మండలి రద్దుకు ఆమోదం తెలిపింది.

news18-telugu
Updated: January 27, 2020, 10:15 AM IST
శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం...
జగన్
  • Share this:
ఏపీ వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం అమలు చేయాలనుకుంటోందో అదే దిశగా అడుగులు వేస్తోంది. శాసన మండలిని రద్దు చేయాలని గత వారం ప్రతిపాదించిన వైసీపీ అధినేత, సీఎం జగన్... ఆ దిశగా కేబినెట్‌తో ఆమోదం లభించేలా చేసుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశమైన కేబినెట్... ప్రధానంగా మండలి రద్దు ప్రతిపాదనపైనే చర్చించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రులంతా ఆమోదించారు. దాంతో ఇవాళ్టి అసెంబ్లీలో మండలి రద్దుపై చర్చ జరిపేందుకు మరింత అనువైన అవకాశాలు లభించాయి. ఇక ప్రభుత్వం మండలి రద్దుపై బిల్లు పెట్టి... ఆమోదింప జేసుకోవడమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఆ బిల్లును కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం ఉభయ సభల్లో బిల్లు ప్రతిపాదనను ఆమోదిస్తే... మండలి రద్దయ్యే అవకాశాలుంటాయి.

ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. ఐతే... ఏపీ ప్రభుత్వం ఇవాళ మండలి రద్దుపై చర్చించాలని డిసైడైంది. అందువల్ల టీడీపీ సభ్యులు వచ్చినా, రాకపోయినా బిల్లు ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించే అవకాశాలున్నాయి. ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఆలస్యం జరగడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల టీడీపీ వచ్చినా, రాకపోయినా... తాము అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా వైసీపీ చీఫ్, సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. అందువల్ల అసెంబ్లీకి టీడీపీ రాకపోతే... అది టీడీపీకే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు