news18-telugu
Updated: May 21, 2020, 12:51 PM IST
ఏపీ కరోనా బులెటిన్
ఏపీ ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే కరోనా బులెటిన్లో మార్పులు చేయడంపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా రోజుల పాటు జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం మూడు రోజుల క్రితం నుంచి ఈ ఫార్మాట్లో కొన్ని మార్పులు చేసింది. కరోనా బులెటిన్లో జిల్లాలవారీగా వివరాలు ఇవ్వడం లేదు. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులతో పాటు డిశ్చార్జ్ అయిన వారి వివరాలను పొందుపరుస్తూ కరోనా కేసులను రిలీజ్ చేస్తోంది. అయితే దీనిపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
కరోనా కేసుల వివరాలను జిల్లాలవారీగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని... వాళ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించే వీలు ఉంటుందని సీఎం జగన్కు రాసిన లేఖలో కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 21, 2020, 12:51 PM IST