
సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో ముఖ్యమైన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. మొత్తం 70 మందితో భారీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో 21 మంది మహిళలకు చోటు దక్కింది. అన్ని సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు.
తెలంగాణలో జరిగిన దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీలో కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. దుబ్బాలో బీజేపీ గెలుపు, జీహెచ్ఎంసీలో భారీ సీట్లు సాధించడంతో ఆ జోష్‌ను ఏపీలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో ముఖ్యమైన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. మొత్తం 70 మందితో భారీ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సీటును జిల్లా యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపట్టారు. కొన్ని చోట్ల ఎక్కువ మందికి ప్రాధాన్యం దక్కింది. మరికొన్ని చోట్ల ఒక్కో పార్లమెంట్‌కు ఒక్కరు, ఇద్దరినే నియమించారు. మొత్తం 70 మంది ఉన్న కమిటీలో 21 మంది మహిళలకు చోటు దక్కింది. అన్ని సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు. జిల్లాల వారీగా ఉన్న సామాజికవర్గాల సమీకరణాలను బేరీజు వేసుకుని నియామకాలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి కందుల రాజమోహన్ రెడ్డి, డి.హరికృష్ణ, బాలకృష్ణ యాదవ్, సుష్మకు చోటు దక్కింది. అలాగే, హిందూపూర్ నుంచి గోరంట్ల మోహన్ శేఖర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం యాదవ్, గాలి పుష్పలతకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 07, 2020, 17:02 IST