మన సీఎం శంకర్‌దాదా ఎంబీబీఎస్.. జగన్‌పై కన్నా ఫైర్..

ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మన సీఎం.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: March 18, 2020, 11:00 AM IST
మన సీఎం శంకర్‌దాదా ఎంబీబీఎస్.. జగన్‌పై కన్నా ఫైర్..
వైఎస్ జగన్, లక్ష్మీనారాయణ
  • Share this:
కరోనా వైరస్‌ను పారాసిటమాల్ టాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్‌తో అదుపు చేయవచ్చని సీఎం జగన్ అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మన సీఎం.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ అంటూ ఎద్దేవా చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇక, రాష్ట్ర పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల వ్యవహారంపై అవసరమైతే తాము కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్‌పై వైసీపీ నేతల మాటల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

‘మహిళా అభ్యర్థుల జాకెట్‌లో చేతులు పెట్టి నామినేషన్‌ పత్రాలు లాక్కున్నప్పుడు ఈసీకి లేఖ రాయని సీఎస్‌..ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగానే రాయడం విడ్డూరంగా ఉంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 18, 2020, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading