మళ్లీ తెరపైకి ఐటీ గ్రిడ్ వ్యవహారం.. సీఎం జగన్‌కు సీనియర్ నేత లేఖ..

ఐటీ గ్రిడ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఎన్నికల ముందు జరిగిన డేటా చోరీ కేస్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు.

news18-telugu
Updated: December 7, 2019, 1:31 PM IST
మళ్లీ తెరపైకి ఐటీ గ్రిడ్ వ్యవహారం.. సీఎం జగన్‌కు సీనియర్ నేత లేఖ..
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యవహారం ఇది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఏర్పాటైన ఈ సంస్థ ఏపీలోని ఆయా నియోజవకర్గాల ఓటరు జాబితాలు తీసుకుని, సేవామిత్ర యాప్‌లో ఓటర్ల పేర్లను ఫీడ్‌చేసి, పేరు, కులం, మతం, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరిచేలా ఒక ఫార్మాట్ తయారుచేశారని సమాచారం. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు, వారు ఎవరికి మొగ్గుచూపుతున్నారనే విషయాలు సహా 15 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి రూపొందించారు. దీని ద్వారా కొన్ని ఓట్లను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీతోపాటు ఇతర పార్టీలవైపు మొగ్గు చూపే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ఓటును రద్దు చేసుకుంటున్నామంటూ నకిలీ సెల్ఫ్‌ డిక్లరేషన్ పెట్టించి ఆయా ఓట్లను డిలీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపీలో 50 చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిందీ వ్యవహారం.

కాగా, ఈ వ్యవహారం తర్వాత ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడం, వైసీసీ అధికారంలోకి రావడం జరిపోయాయి. ఆ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఎన్నికల ముందు జరిగిన డేటా చోరీ కేస్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. 7కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయని మార్చిలో కేస్ నమోదు చేశారని, ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్‌ను ఇంతవరకు ఎందుకు పోలీసులు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యత మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నిలదీశారు. ఐటీ గ్రిడ్ కేసు నిందితుల్ని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>