జగన్ ప్రభుత్వ తీరుతో రూ.1400 కోట్లు వృథా.. ఏపీ నేత సంచలన వ్యాఖ్యలు..

YCP Party Colours : ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను మూడు వారాల్లోగా తొలగించాలని, స్థానిక ఎన్నికల నాటికి ఆ రంగులు కనిపించొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

news18-telugu
Updated: April 21, 2020, 8:09 AM IST
జగన్ ప్రభుత్వ తీరుతో రూ.1400 కోట్లు వృథా.. ఏపీ నేత సంచలన వ్యాఖ్యలు..
వైసీపీ పార్టీ రంగులను పోలిన రంగులను వేసిన దృశ్యం
  • Share this:
YCP Party Colours : ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను మూడు వారాల్లోగా తొలగించాలని, స్థానిక ఎన్నికల నాటికి ఆ రంగులు కనిపించొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హై కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ‘పరాకాష్టకు చేరింది వైసీపీ రంగుల రాజకీయం. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేయడం అక్రమం అంటూ బీజేపీ ఎన్నోసార్లు హెచ్చరించినా సుమారు 1400 కోట్లు దుర్వినియోగం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇపుడు రంగులు మార్చడానికి ఎంత వృధా చేయనున్నారో? ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి.’ అని ముందుగా ఒక ట్వీట్ చేసిన ఆయన మరో ట్వీట్‌లోనూ వైసీపీ రంగులపై విమర్శలు గుప్పించారు.‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైంది. బోరు పంపుల నుంచీ స్మశానవాటికలో సమాధులకు కూడా రంగులేశారు. చెట్టూపుట్టా దగ్గర మొదలెట్టి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామసచివాలయలు..చివరకు విజ్ఞత మరిచి జాతీయ జెండా తొలగించి పార్టీ రంగులు వేశారు’ అని తీవ్రంగా విమర్శించారాయన.

First published: April 21, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading