news18-telugu
Updated: February 15, 2020, 10:34 PM IST
సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో భారీ ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల మీద దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో బీజేపీ నేతలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఇసుక దందాను అడ్డుకున్న బీజేపీ నేత సత్యనారాయణరెడ్డిపై కేసు పెట్టారని చెప్పారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 19న కడప జిల్లాలో ధర్నాలు చేయాలని నిర్ణయించామన్నారు.

వైఎస్ జగన్, కన్నా లక్ష్మీనారాయణ
మరోవైపు ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా? లేదా అనే అంశంపై తనకు సమాచారం లేదని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు సమానదూరం పాటించాలనేదే తమ పార్టీ అభిమతమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే కలిసి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
February 15, 2020, 10:26 PM IST