‘మారాలి జగన్.. మార్పు రావాలి జగన్’, ఏపీ బీజేపీ కొత్త నినాదం

‘మారాలి జగన్...! మార్పు రావాలి జగన్...!’ పేరుతో కొత్త నినాదానికి బీజేపీ బీజం వేసింది.

news18-telugu
Updated: October 9, 2020, 5:05 PM IST
‘మారాలి జగన్.. మార్పు రావాలి జగన్’, ఏపీ బీజేపీ కొత్త నినాదం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొత్త నినాదాన్ని అందుకుంటోంది. ‘మారాలి జగన్...! మార్పు రావాలి జగన్...!’ పేరుతో కొత్త నినాదానికి బీజేపీ బీజం వేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు, విద్యాశాఖ మంత్రికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘జగనన్నవిద్యాదీవెన లో 60% నిధులు ఏక్కడ నుండి వచ్చాయి? గత కొద్ది రోజుల క్రితం 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జగనన్నగోరుముద్ద అనడం నిజం కాదా? ఇది వాస్తవం. వంద శాతం నిజం. కేంద్ర ప్రభుత్వ పథకమైన సమగ్రశిక్ష అభియాన్ 2020-21క్రింద రూ.655.60 కోట్లలో కేంద్ర60% వాట ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం 40% వాటా కలిపి రాష్ట్రంలోని 30 లక్షల 70 వేల 901 విద్యార్థులకు 3జతల యూనిఫాం, పుస్తకాలు, షూస్ - సాక్సులు, బెల్ట్, బ్యాగ్ లు రాష్ట్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు, వారి కుటుంబ ట్రస్ట్ నిధుల ఖర్చు పెట్టి సేవ చేస్తే అభ్యంతరం ఉండదు. 60% కేంద్ర, 40% రాష్ట్ర నిధులతో నిర్వహించే పథకాలకు ఈ సొం డబ్బా కొట్టుకోవడానికి వెచ్చించే ఆలోచనలు విద్యా ప్రమాణాలపై దృష్టి పెడితే ప్రజలు హర్షిస్తారు. ఈ పథకానికి "జగనన్న విద్య కానుక" అనే స్టిక్కర్ విద్యార్థుల స్కూల్ బ్యాగ్ లపైన, బెల్ట్ లపైన అంటించి మరోసారి "స్టిక్కర్ సీఎం"పేరు జగన్ సార్ధకం చేసుకున్నారు. ఇది నిజమో కాదో సమాధానం చెప్పండి.’ అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇటీవల ఏపీలో అధికార వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మరికొందరు నేతలు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో జగన్ సమావేశం అయ్యారు. కేంద్రం రెండు కేబినెట్ బెర్త్‌లు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత దానిపై ఎలాంటి చర్చ లేదు. అయితే, దీనిపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఇటీవల స్పందించారు. 'ఏపీలో వైసీపీ, టీడీపీతో బీజేపీ కలిసే పరిస్థితి లేదు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం స్పష్టతతో ఉంది. జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌లోకి రమ్మన్నారని వైసీపీనే ప్రచారం చేస్తోందని నాకు అనుమానం కలుగుతోంది. సీబీఐ కేసుల నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి తెస్తున్నారు. మోదీ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలో.. వైసీపీ ప్రభుత్వంతోనూ అలానే ఉంటుంది' అని మాధవ్ తేల్చిచెప్పారు.

వైసీపీ అధికారికంగా కేంద్రంలో చేరకపోయినా అన్నిరకాలుగా సహకారం అందిస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చే బిల్లులకు మద్దతు పలుకుతోంది. అలాగే, కేంద్రం పెట్టే ప్రతి కండిషన్‌ను కూడా అంగీకరించి రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఇటీవల వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం, అలాగే, అదనపు నిధుల కోసం రుణాలు పొందాలంటే కేంద్రం విధించిన సంస్కరణలను అమలు చేయాలని చెప్పగా, వాటిని కూడా అమలు చేశారు సీఎం జగన్. కేంద్రంతో సయోధ్యతో ముందుకు సాగుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2020, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading