AP BJP: ఏపీ బీజేపీ కొత్త టీమ్ ఇదే.. మొత్తం ఎంతమందంటే..

AP BJP New Committee: కొద్దిరోజుల క్రితం ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. తాజాగా రాష్ట్ర బీజేపీ కొత్త టీమ్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

news18-telugu
Updated: September 13, 2020, 2:37 PM IST
AP BJP: ఏపీ బీజేపీ కొత్త టీమ్ ఇదే.. మొత్తం ఎంతమందంటే..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందుకోసం పార్టీలో మార్పులు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. తాజాగా రాష్ట్ర బీజేపీ కొత్త టీమ్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు సూచనలతో ఎక్కువ మందికి ఈ కమిటీలో చోటు దక్కినట్టు తెలుస్తోంది. 40 మొత్తం 40 మందితో ఏపీ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటైంది. సోము వీర్రాజు కొత్త టీమ్‌లో 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా విష్ణుకుమార్‌రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మీ, మాలతీరాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌలిని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్.గాంధీలు నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా భాను ప్రకాష్‌రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్.శ్రీనివాస్.. ట్రెజరర్‌గా సత్యమూర్తి, ఆఫీస్ సెక్రటరీగా పి.శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబుకు ఈ కమిటీలో చోటు దక్కింది.
Published by: Kishore Akkaladevi
First published: September 13, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading