జగన్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ... అందుకే అని వివరణ

రాజధాని నిపుణుల కమిటీకి తాను కొన్ని సలహాలు ఇచ్చానని...వాటిని సీఎం జగన్‌కు వివరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

news18-telugu
Updated: November 11, 2019, 8:00 PM IST
జగన్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ... అందుకే అని వివరణ
వైఎస్ జగన్
  • Share this:
రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు... తాను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశానని వివరించారు. రాజధాని నిపుణుల కమిటీకి తాను కొన్ని సలహాలు ఇచ్చానని...వాటిని సీఎం జగన్‌కు వివరించారని తెలిపారు. రాజధానిపై మాజీ సీఎం చంద్రబాబు అర్భాటం చేశారని... రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారని సోము వీర్రాజు అన్నారు. అంత డబ్బు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

విడిపోయిన రాష్ట్రం రాజధాని కట్టుకోవడం సహజం అని... అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సోము వీర్రాజు సమర్థించారు. ఇది మంచి నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. 42శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు, ఉద్యోగ సాధనకు ఇంగ్లీష్‌ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తెలుగు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్‌ కూడా అంతే ముఖ్యమని సీఎం జగన్‌కు వివరించానని అన్నారు.First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు