మహారాష్ట్రలో ఫడ్నవిస్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఏపీలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో సుపరిపాలన అందిస్తారని మెజార్టీ సీట్లు బీజేపీకి ప్రజలు కట్టబెట్టారు. శివసేన బీజేపీకి నమ్మకం ద్రోహం చేసిందన్నారామె. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవిస్ నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ అద్భుతమైన పాలనను బీజేపీ మహారాష్ట్రలో అందిస్తుందన్నారు. తన స్వరూపనికి భిన్నంగా శివసేన వ్యవహరించిందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన అధికార దాహంతో చేతులు కలిపిందన్నారు. పొత్తుల కారణంగా బీజేపీకి మహారాష్ట్ర లో సీట్లు తగ్గాయన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.