చంద్రబాబుతో అంతవరకే... లీకులపై మండిపడ్డ బీజేపీ నేత

చంద్రబాబు తల కిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లే అని అన్నారు.

news18-telugu
Updated: November 12, 2019, 3:33 PM IST
చంద్రబాబుతో అంతవరకే... లీకులపై మండిపడ్డ బీజేపీ నేత
చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
  • Share this:
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన దీక్షకు తాము సంఘీభావం మాత్రమే తెలియజేశాం తప్ప కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఆయన వివరించారు. ఏపీలో టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింద... చంద్రబాబు కొందరు నేతలను మా దగ్గరికి పంపి మీడియాకు లీకులిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రకంగా చేసి ప్రజలను తికమక పెట్టొద్దని ఆయన టీడీపీకి స్పష్టం చేశారు. చంద్రబాబు తల కిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దృష్టిలో టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లే అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

బీజేపీకి చంద్రబాబు చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. చంద్రబాబుకు మేం 240 కిలోమీటర్లు దూరంగా ఉంటామని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీ లిమిటెడ్‌ కంపెనీగా మారి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీని ఏలారని... ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయమని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు తప్ప ఏ బలమైన నాయకుడు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనాయకత్వంలో చర్చలు జరుపుతూ ఉండొచ్చని... ఆ విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.






First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com