జగన్ పాలనపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక లోటుతో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు పురంధేశ్వరి.

news18-telugu
Updated: February 18, 2020, 4:21 PM IST
జగన్ పాలనపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్, పురంధేశ్వరి
  • Share this:
ఏపీలో జగన్ పాలనపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి. వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఆర్థిక లోటుతో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు పురంధేశ్వరి.

మూడురాజధానుల అంశంతో పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నా ప్రభుత్వం... మరి తొలి భేటీలోనే శాసన మండలి రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్నారు.

ఢిల్లీ పర్యటన తర్వాత.. జగన్‌ను టార్గెట్ చేసే పనిలో పడ్డారు ఏపీ బీజేపీ నేతలు. అంతవరకు సైలెంట్‌గా ఉన్న నాయకులంతా.. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరిగా బయటకు వచ్చి జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. రాజధాని విషయంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే అప్పుడప్పుడు ఖండిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సునీల్ దేవదర్, పురంధేశ్వరి వంటి వాళ్లు కూడా జగన్ పాలనతో పాటు.. ఏపీలో పలు రాజకీయ నిర్ణయాలపై స్పందిస్తున్నారు.
First published: February 18, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading