వైసీపీ, బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధికాంరలో ఉన్నప్పుడు కూడా ఏపీకి బీజేపీ ఎలాంటి మేలు చేయలేదన్న ప్రజల్లో ముద్ర వేశారన్నారు పురంధేశ్వరి

news18-telugu
Updated: February 16, 2020, 1:54 PM IST
వైసీపీ, బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్, పురంధేశ్వరి
  • Share this:
ఏపీ రాజకీయాలపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్పు, పీపీఏలపై  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడం లేదని విమర్శించారు. ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లిన జగన్... అక్కడ ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి వైసీపీ, బీజేపీ పొత్తుపై వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లోకి కూడా వైసీపీ నేతలకు బెర్త్ ఖాయం అయ్యిందన్న పుకార్లు పుట్టాయి. అయితే పురంధేశ్వరి మాత్రం వాటిని తోసిపుచ్చారు. ఏపీలో బీజేపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. టీడీపీ, వైసీపీ ఏ పార్టీతో కూడా కమలం పార్టీ చేతులు కలపడం లేదని తేల్చేశారు. జనసేన పార్టీతో మాత్రమే తమకున్న ఆలోచనలు మేరకు ఏపీలో కలిసి పనిచేస్తామన్నారామె. కేవలం బీజేపీని బ్యాడ్ చేసేందుకే... ఇలాంటి దుష్ప్రచారాం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. టీడీపీ అధికాంరలో ఉన్నప్పుడు కూడా ఏపీకి బీజేపీ ఎలాంటి  మేలు చేయలేదన్న ప్రజల్లో ముద్ర వేశారన్నారు. ఇవాళ కూడా బీజేపీ పార్టీని దెబ్బ తీయాలన్న ఆలోచనతోనే వైసీపీతో కలిసి వెళ్తున్నారనే పుకార్లు లేవనెత్తుతున్నారన్నారు.

ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు నాయుడుపై కూడా పలు ఆరోపణలు చేశారు. గతంలో మండలి రద్దు సరైనదన్న చంద్రబాబు... ఇప్పుడు ఎందుకు శాసనమండలి రద్దును వద్దంటున్నారో చెప్పాలన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం స్వార్థ రాజకీయాలతోనే పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు తమ భూముల్ని కాపాడుకోవడం కోసమే అమరావతి రాజధాని చేయాలంటున్నారని విమర్శించారు పురంధేశ్వరి. ఇక ఏపీలో చంద్రబాబు పీఏ ఇంట్లో జరిగిన ఐటీ దాడులు గురించి మేం ఏం మాట్లాడుతామన్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలు ఆ శాఖ తీసుకుంటుందన్నారామె.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు