Andhra Pradesh: ఏపీలో బీజేపీ నేతకు షాకిచ్చిన అధిష్టానం... పార్టీ నుంచి సస్పెండ్

కొద్దికాలంగా తమ ఆదేశాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న బీజేపీ నేత పై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ నాయకుడిని సస్పెండ్ చేసింది.

news18
Updated: October 20, 2020, 2:05 PM IST
Andhra Pradesh: ఏపీలో బీజేపీ నేతకు షాకిచ్చిన అధిష్టానం... పార్టీ నుంచి సస్పెండ్
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 20, 2020, 2:05 PM IST
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేత లంకా దినాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దినాకర్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర శాఖ అనుమతి లేకుండానే టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇదే విషయమై ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా దినాకర్ వైఖరిలో మార్పు లేకపోవడంతో అధిష్టానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీలో ఉన్న లంకా దినాకర్.. కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరారు. బీజేపీ అంతర్గత సమావేశాల్లోని వివరాలను వేరే పార్టీ వాళ్లకు చేరవేస్తున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి.

కాగా, పార్టీ కి కీడు కలిగించేలా సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారని కూడా బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేగాక కొన్ని టీవీ ఛానెళ్లు తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులను కాకుండా.. తమ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడే నాయకులను చర్చకు పిలుస్తున్నారని బీజేపీ ఆరోపించింది.



ఇకపైన తమ పార్టీలో అధికారిక ప్రతినిధులుగా ఉన్న నేతలనే చర్చకు పిలవాలని బీజేపీ అధిష్టానం టీవీ ఛానెళ్లకు ఒక లేఖను విడుదల చేసింది.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading