Home /News /politics /

AP BJP KEY DECISION ON CAPITAL AMARAVATI AK

కేంద్రానికి షాక్... అమరావతిపై ఏపీ బీజేపీ కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని తరలింపుపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది.

    అమరావతిపై ఏపీ బీజేపీ నేతల కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీడ్ క్యాపిటల్ సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో సహా కీలక విభాగాలన్నీ అమరావతి నుంచే పని చేయాలని తీర్మానం చేశారు. రాజధాని తరలింపుపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అమరావతిలో కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలకు బీజేపీలోని అనేక మంది నేతలు మద్దతు తెలుపుతున్నారు. రాజధాని అమరావతిని అంగుళం కూడా జరపలేరని గతంలో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి... నేడు మరోసారి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.

    అయితే అమరావతిపై ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంలో కేంద్రం జోక్యం అవసరం లేదని జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు అభిప్రాయపడగా... ఇందుకు పూర్తి భిన్నమైన వాదనను వినిపించారు ఎంపీలు సుజనా, సీఎం రమేశ్, మాజీ ఎంపీ పురేంధేశ్వరి. కేంద్రం జోక్యం కోరడంలో తప్పులేదని వీరు తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ విషయంలో కేంద్రం జోక్యం కోరడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Ap bjp

    తదుపరి వార్తలు