కన్నా విషయంలో రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ ?

కన్నాను టార్గెట్ చేసిన వైసీపీని విమర్శించే విషయంలో ఏపీ బీజేపీ నేతలు డైలమాలో పడినట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: April 23, 2020, 7:16 PM IST
కన్నా విషయంలో రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ ?
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని పలు అంశాలపై బీజేపీ వైఖరి ఏమిటన్నది అంత తొందరగా తెలియడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా ఆ పార్టీలోని పలువురు నేతలు... ఎవరి ఆలోచనలను వాళ్లు చెబుతుండటమే. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం విషయంలో ఏపీ బీజేపీ ఇదే రకమైన వైఖరితో ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అంతర్గత విషయాలను ప్రస్తావించి మరీ... ఆ పార్టీ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి. ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ ఫండ్‌ దోచేశారని ఆరోపించారు.

విజయసాయిరెడ్డి ఈ రేంజ్‌లో కన్నాపై విమర్శలు చేసినా...ఏపీ బీజేపీలోని అనేక మంది నేతలు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. కొందరు వైసీపీపై ఎదురుదాడి చేయగా... మరికొందరు తమకెందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా మిన్నకుండిపోయారు. ఏపీ బీజేపీలో పెద్ద నేతలుగా చెప్పుకునే చాలామంది నాయకులు ఈ విషయంలో స్పందించలేదు. ఇక ఏపీ బీజేపీకి సంబంధించి ఏ విషయంలో అయినా ముందుండే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జీవీఎల్ నరసింహరావు కూడా ఈ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు.

ఇక కన్నాతో పాటు విజయసాయిరెడ్డి పురంధేశ్వరి పేరును ప్రస్తావించారు. ఆమె కూడా ఈ ఎపిసోడ్‌పై ఇంతవరకు నోరు విప్పలేదు. దీంతో అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు ఈ అంశంపై ఢిల్లీకి చెందిన బీజేపీ పెద్దలు స్పందించేంతవరకు తాము స్పందించకూడదని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నాను టార్గెట్ చేసిన వైసీపీ... ఆ పార్టీలో కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేయడంలో మరోసారి సక్సెస్ సాధించినట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: April 23, 2020, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading