నిమ్మగడ్డ విషయంలో వైసీపీకి బీజేపీ కౌంటర్

వైసీపీ ప్రభుత్వవిధానాలపై సొంత పార్టీ ఎంపీ,ఎమ్మెల్యేల నిరసనల నుండి దృష్టి మరల్చడానికి హొటల్ విషయన్ని మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపించింది.

news18-telugu
Updated: June 25, 2020, 4:49 PM IST
నిమ్మగడ్డ విషయంలో వైసీపీకి బీజేపీ కౌంటర్
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ హోటల్‌లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను కలవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ఎవరికి వారే స్పందిస్తున్నారు తప్ప... అసలు ఈ అంశంపై ఏపీ బీజేపీ వైఖరి ఏమిటనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా నిమ్మగడ్డతో బీజేపీ నేతల మీటింగ్‌పై ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ వ్యవహారంలో వైసీపీకి ఏపీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వవిధానాలపై సొంత పార్టీ ఎంపీ,ఎమ్మెల్యేల నిరసనల నుండి దృష్టి మరల్చడానికి హొటల్ విషయన్ని మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపించింది.



నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి ఎంపీని కలవడం విషయంపై స్పందిస్తూ... అసలు ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా ? అని ప్రశ్నించింది. వైసీపీతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదని సమాధానమిచ్చింది. మొత్తానికి నిమ్మగడ్డ వ్యవహారంలో సుజనా, కామినేని శ్రీనివాస్‌కు ఏపీ బీజేపీ మద్దతుగా నిలిచినట్టు అర్థమవుతోంది.




First published: June 25, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading