AP BJP CHIEF SOMUVEER RAJU APOLOGIZES TO RAYALASEEMA PEOPLE FOR WITHDRAWING HIS REMARKS SNR
సీమ ప్రజలకు క్షమాపణ చెప్పిన సోమువీర్రాజు..వరుస విమర్శలు దేనికి దారి తీసేనో..
ప్రతీకాత్మకచిత్రం
Somu veerraju: తనను క్షమించమని కోరారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు. రాయలసీమ ప్రాంత ప్రజల మనసులు గాయపడేలా మాట్లాడటం పొరపాటుగా అంగీకరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో వచ్చిన పదాలు తప్ప తనకు రాయలసీమపైన ఎంతో అభిమానం ఉందని ట్వీట్ చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు(Ap Bjp chief)సోము వీర్రాజు పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పార్టీ వేదికలు, సమావేశాల్లో తన వాగ్ధాటిని బలంగా వినిపించేందుకో..లేక ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఆలోచనో తెలియదు కానీ పదే పదే నోరు జారుతూ రాష్ట్రంలోని అధికార పార్టీకి అడ్డంగా దొరికిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో హత్యలు చేసిన జిల్లాలకు ఎయిర్‌పోర్టులా అంటూ సోమువీర్రాజు (Somuveer Raju)చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంత నేతలు, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై సోము వీర్రాజు వైసీపీ నేతలు(Ycp leaders), సీమప్రాంత నాయకులు టార్గెట్ చేశారు. ఏపీ చీఫ్ విప్(Ap Chief Vip)శ్రీకాంత్‌రెడ్డి (Srikanth Reddy)సోమువీర్రాజు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు సోమువీర్రాజు. ట్విట్టర్ (Twitter)వేదికగా క్షమాపణ (Apologizes)చెప్పారు. అంతే కాదు రాయలసీమ రతనాల సీమ ఈ పదం తన హృదయంలో ఎప్పటికి పదిలంగా ఉంటుందని కామెంట్ కోడ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో వాడిన పదాలు వల్ల రాయలసీమ ప్రజల మనుసులు గాయపడ్డాయని సోమువీర్రాజు ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నాని తెలిపారు. తాను రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయాన్ని సీమ ప్రజలు తెలుసుకోవాలని కోరారు. రాయలసీమకు రావాల్సిన నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై అనేక సందర్భాల్లో ప్రస్తావించానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ది ఇంకా వేగవంతం కావాలన్నదే బీజేపీ ఆలోచన అంటూ తన వ్యాఖ్యలతో ఏర్పడ్డ డ్యామేజీని పూడ్చుకునేందుకు ప్రయత్నించారు సోమువీర్రాజు.
సోమువీర్రాజు సారీ చెప్పారుగా..
వైఎస్ వివేక హత్యను అడ్డుపెట్టుకున్న సోమువీర్రాజు మొదట తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు. కానీ వివాదం ముదిరి పాకానపడటంతో ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. రాయలసీమ విషయంలోనే కాదు కొద్ది రోజుల క్రితం మద్యం ధరల విషయంలో కూడా సోమువీర్రాజు బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ని చీప్‌గా అందిస్తామని ఓట్లు వేయమని అడగడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ విషయంలో ఏకంగా ఆయనకు సారాయి వీర్రాజుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు కడపను హత్యలు చేసిన జిల్లాగా అభివర్ణించే క్రమంలో మొత్తం రాయలసీమను కలిపి విమర్శించడం సోమువీర్రాజును చిక్కుల్లో పడేలా చేసింది.
👉 "రాయలసీమ రతనాల సీమ" ఈ పదం నాహృదయం లో పదిలం.
👉 రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను.
👉 ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. (1/2)
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) January 29, 2022
మాట తెచ్చిన తిప్పలు..
ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ పుంజుకోవాల్సిన సమయంలో విమర్శల పాలవుతోంది. పార్టీ అధ్యక్షుడే అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి డ్యామేజ్ చేస్తున్నారని హైకమాండ్ మదిలో ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషణకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టించి, అధికార పార్టీని విమర్శించే నాయకుల్ని అధ్యక్ష హోదా కట్టబెట్టాలని హైకమాండ్ గత కొంతకాలంగా ఎదురుచూస్తోంది. ఈక్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్ రేసులో దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వంటి వాళ్ల పేర్లను పరిశీలిస్తుందని ప్రచారం కూడా జరిగింది. పదవి గండం పొంచి ఉన్న సమయంలో సోమువీర్రాజు ఇలా కొత్త సమస్యల్ని కొని తెచ్చుకోవడం చూస్తుంటే అధ్యక్షుడి మార్పు తధ్యం అనే సంకేతాలు ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి వస్తున్నాట్లు సమాచారం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోంచి సోమువీర్రాజు చెప్పిన ఒక్క సారీ ఆయన్ని బయటపడేస్తుందో లేదో చూడాలి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.