హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీలో వారికి నెలకు రూ.10వేలు, సీఎం జగన్ ముందు ప్రతిపాదన

ఏపీలో వారికి నెలకు రూ.10వేలు, సీఎం జగన్ ముందు ప్రతిపాదన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం (File)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం (File)

కరోనా వైరస్ కారణంగా, లాక్ డౌన్ వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

కరోనా వైరస్ కారణంగా, లాక్ డౌన్ వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని 47వేల ప్రభుత్వ స్కూళ్లలో 42 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, 15 వేల ప్రైవేటు స్కూళ్లలో 37 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల తల్లిదండ్రులు చెల్లించాల్సిన ఫీజు బకాయిలు 40 శాతం ఆగిపోయాయని చెప్పారు. పాఠశాలలు తెరవకపోవడం వల్ల అడ్మిషన్లు లేక యాజమాన్యాలు ఆర్ధికనష్టాల బారినపడ్డారని గుర్తు చేశారు. పాఠశాల భవనాల అద్దె, బస్సులకు చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేక తీవ్రమైన వత్తిడికి గురౌతున్నారని, ఈ ఒత్తిడిని తట్టుకోలేని 40 మంది కరెస్పాండెంట్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందులో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారని సోము వీర్రాజు చెప్పారు. ఇలాంటి కష్టాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి అణచివేతధోరణి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. గుర్తింపుకోసం మరలా తనఖీలు చేస్తామని జీఓలు జారీచేసిందని, గతంలో తనఖీలు చేసి అన్ని రకాల సౌకర్యాలు ఉంటేనే గుర్తింపు ఇచ్చారన్నారు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే సమయం ఇస్తేచాలని వీర్రాజు అభిప్రాయపడ్డారు. అంతేకాని నష్టాల్లో కూరుకున్న సంస్థలను మరింత కుంగదీసేలా ఇబ్బందిపెడుతున్నారని ఆక్షేపించారు.

జగన్‌కు రాసిన లేఖలో సోము వీర్రాజు డిమాండ్లు


  1. 8 నెలలుగా జీతాలు లేక ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయలును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేల గౌరవవేతనం ఇవ్వాలి.

  2. పాఠశాలలు తెరవని కారణంగా రుణాలకు సంబంధించి మారటోరియం కాలాన్ని 2021 జూన్‌ నెల వరకు వడ్డీలేకుండా పొడిగించాలి.

  3. ఫీజు రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ పరిధి నుంచి చిన్న పాఠశాలలను తొలగించాలి.

  4. పాఠశాలల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నేషన్‌ను మూడేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించాలి.

  5. పాఠశాలలు నడవని కారణంగా స్కూలు బస్సులకు చెల్లించాల్సిన రోడ్డు టాక్సు, ఫిట్నెస్‌, బీమా గడువును 2021 మే వరకు పొడిగించాలి.


మోదీ ప్రతినిధిగా చెబుతున్నా, అమరావతే రాజధాని: సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతే ఉండాలని, ఇందులో రెండో అంశానికి చోటులేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా విజయవాడలోనే నిర్మిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 14న తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని అన్నారు. తాము అధికారంలో వస్తే అమరావతి రైతులకు ఇచ్చిన ఫ్లాట్లను రూ. 2వేల కోట్లతో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలో ఉంటాయని అన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలు నేరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm ys jagan mohan reddy, Somu veerraju

ఉత్తమ కథలు