ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్... కొత్త అధ్యక్షుడిగా యువనేత ?

కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు కొత్తవారికి అప్పగిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: January 20, 2020, 3:49 PM IST
ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్... కొత్త అధ్యక్షుడిగా యువనేత ?
కన్నా లక్ష్మీనారాయణ
  • Share this:
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరుగుతున్న తరుణంలో ఆయన ఒంటరిగా ఢిల్లీ వెళ్లడం రాష్ట్ర పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువ నాయకుడిని నియమించబోతున్నారన్న ప్రచారం జోరుగా ఊపందుకుంది.ఇదే సమయంలో ఆయన ఒంటరిగా ఢిల్లీకి వెళ్లడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. గత

కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు కొత్తవారికి అప్పగిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కన్నా వర్గం మాత్రం అలాంటిదేం లేదంటున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకే కన్నా లక్ష్మీనారాయణ హస్తినకు వెళ్లారని బీజేపీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి.ఇటీవలే జనసేన పార్టీ కమలంతో జత కట్టడంతో... రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈరెండు పార్టీలు ఇకపై కలిసి నడుస్తాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు